ఆర్ఐ పై అవినీతి ఆరోప‌ణ‌లు..?

by Nallavelli.Anjaneyulu |

అత‌ను ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. ప్ర‌జా సేవ‌లో భాగంగా ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆ ఉద్యోగి.. పైసా లేనిదే పని కాదని అంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఆర్ఐ పై  అవినీతి ఆరోప‌ణ‌లు..?
X

దిశ, జమ్మికుంట : అత‌ను ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. ప్ర‌జా సేవ‌లో భాగంగా ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆ ఉద్యోగి.. పైసా లేనిదే పని కాదని అంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జమ్మికుంట త‌హ‌శీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్నఆర్ఐ ఏ పని చేయాలనుకున్న చేయి తడపాల్సిందే అని పేర్కొంటున్నారు. ఇది ఎవరో అంటున్న విషయం కాదు.. పట్టణంలోని ప్రజలు అంటున్న మాట. గత రెండు సంవత్సరాలుగా ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి పెండింగ్ లో ఉన్న ఎలాంటి భూములైన ఎంక్వయిరీ లేకుండానే త‌హ‌శీల్దార్ కి రిపోర్ట్ అందజేసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం అందించే రేషన్ కార్డుల జారీలో కూడా ఇత‌ను లంచం తీసుకున్నాడ‌ని కొంద‌రూ ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు.

అలాగే విద్యార్థులు తీసుకునే కులం, ఆధాయం సర్టిఫికేట్ సహా స్థానిక నివాస సర్టిఫికేట్ వంటి వాటి జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు కొంతకాలంగా స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా స్థానిక త‌హ‌శీల్దార్ కార్యాలయంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది స్థానిక ప్రజల ఆరోపణ. ఆర్ఐ చేతివాటం విషయంలోనే కాదు.. సమయపాలనలో కూడా ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అధికారిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని.. ఆర్ఐ ని ఇక్కడి నుంచి మరోచోటికి బదిలీ చేయాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నఆర్ఐ ని ఉన్నతాధికారులు బదిలీ చేస్తారో లేక అతనిపై చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి మ‌రీ.

Next Story