సీపీఆర్ చేసి నిండు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు

by Nallavelli.Anjaneyulu |

దిశ, వేములవాడ : హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన ఓ వ్యక్తికి సమయానికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఇద్దరు కానిస్టేబుళ్లు.

సీపీఆర్ చేసి నిండు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు
X

దిశ, వేములవాడ : హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన ఓ వ్యక్తికి సమయానికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఇద్దరు కానిస్టేబుళ్లు. వివరాల్లోకి వెళితే.. వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లికి చెందిన రమేష్ (49) అనే వ్యక్తి మంగళవారం ఉదయం తిప్పాపూర్ బస్టాండ్ కు ఎదురుగా ఉన్న ఓ హోటల్ ముందు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏ. ఆర్. కానిస్టేబుళ్లు గంగరాజు, శ్రీనివాస్ లు వెంటనే స్పందించి రమేష్ కు సీపీఆర్ చేసి సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన వ్యక్తికి సమయానికి సీపీఆర్ అందించి చాకచక్యంగా వ్యవహరించినా కానిస్టేబుళ్లను ఎస్పీ మహేష్ బి.గీతే అభినందించగా.. సదరు కానిస్టేబుల్ లను నెటిజన్లు అభినందిస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం కాపాడిందని పోలీసులు చర్చించుకుంటున్నారు.

Next Story