- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంథని మున్సిపల్ " పీఠం " హస్తగతం
మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, మంథని : మంథని మున్సిపాలిటీ పిఠాన్ని హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 13 వార్డుల్లో కాంగ్రెస్ 11, 1 ఫార్వర్డ్ బ్లాక్ (సింహం) , 1 బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు 1 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కుర్రు లింగయ్య 590 ఓట్లతో బిఆరెస్ అభ్యర్థి పై గెలుపొందారు. 2 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నూకల కమల్ 505 ఓట్లతో బిఆరెస్ అభ్యర్థి పై గెలుపొందారు. 3 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాచిడి రాజు గౌడ్ 325 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి పై గెలుపొందారు. 4 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎరుకల స్రవంతి 521 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి పై గెలుపొందారు. 5 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ముస్కుల సహేందర్ రెడ్డి 432 ఓట్లతో బీజేపీ అభ్యర్థి పై గెలుపొందారు. 6 వార్డు లో ఏఐఎఫ్బి అభ్యర్థి పోతారబోయిన శ్రీలత 670 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి పై గెలుపొందారు. 7 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జంబోజు సమ్మయ్య 448 ఓట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థి పై గెలుపొందారు.8 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరేడ్ల విజయలక్ష్మి 612 ఓట్లతో బిఆరెస్ అభ్యర్థి పై గెలుపొందారు.9 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మారుపాక నిహారిక బిఆరెస్ అభ్యర్థి పై గెలుపొందారు.10 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పెంట రాజు 558 ఓట్లతో బిఆరెస్ అభ్యర్థి పై గెలుపొందారు. 11 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వోడ్నాల శ్రీనివాస్ 573 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి పై గెలుపొందారు.12 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వేముల విజయలక్ష్మి 483 ఓట్లతో బిఆరెస్ అభ్యర్థి పై గెలుపొందారు.13 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లంకి వంశీ 456 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి పై గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 3 వ వార్డ్ లో బిఆరెస్ అభ్యర్థి ,6 వార్డ్ ఫార్వర్డ్ బ్లాక్ (సింహం గుర్తు) అభ్యర్థి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి కాంగ్రెస్ అభ్యర్థులు అవకాశాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి పోతరవేణి శ్రీలత 474 మెజారిటీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి పై భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అట్టహాసంగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.
మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి,తన పై నమ్మకం ఉంచిన మంథని పట్టణ ప్రజలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు.. ప్రజల కళ్ల ముందు కనిపించే మార్పులో చూపిస్తానని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నానట్లు తెలిపారు.మీ అందరి సహకారంతో మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా.ఈ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు." విజయ గర్వంతో కాదు.. బాధ్యతతో మీ సేవలో అంటూ.. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.






