- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెక్ డ్యామ్ విధ్వంసం పై కాంగ్రెస్ మద్దతు దారుణం : కొలిపాక శ్రీనివాస్
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన చెక్ డ్యామ్ ధ్వంసం ఘటనపై రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజల ప్రయోజనాల కోసం

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన చెక్ డ్యామ్ ధ్వంసం ఘటనపై రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజల ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ కట్టడాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్‌ఎస్ నాయకులు ఈ విధ్వంసానికి కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు పలకడం అత్యంత దారుణమని ఆరోపించారు. ఈ సంఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. చెక్ డ్యామ్‌ల నిర్మాణం రైతాంగానికి స్థానిక ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని గుర్తు చేశారు. నీరు నిల్వ ఉండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరగడానికి చెక్ డ్యామ్‌లు ఉపయోగపడతాయని అన్నారు. భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందించే ఇలాంటి నిర్మాణాన్ని కేవలం ఇసుక తవ్వకాల మాఫియా ప్రయోజనాల కోసం కూల్చివేయడం అత్యంత దారుణం అన్నారు. ఇది ప్రజల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇంతటి ప్రజా వ్యతిరేక చర్యకు అధికారపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంపై శ్రీనివాస్ విస్మయం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉండి ప్రజల సొమ్ముతో, వారి భవిష్యత్తు కోసం నిర్మించిన కట్టడాన్ని ధ్వంసం చేసిన వారిని సమర్థించడం చాలా బాధాకరం అన్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు ఇసుక మాఫియాతో వారికి ఉన్న అక్రమ సంబంధాలను స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ విధ్వంసం వెనుక ఉన్న శక్తులను, వారికి మద్దతిస్తున్న రాజకీయ నాయకులను ప్రజలు గమనిస్తున్నారని వారికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
కఠిన చర్యలకు బీఆర్‌ఎస్ డిమాండ్
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధ్వంసానికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కొలిపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విధ్వంసం వెనుక ఉన్న పెద్ద తలకాయలను ఉపేక్షించకూడదని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా దోషులను త్వరగా అరెస్ట్ చేసి, చెక్ డ్యామ్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, పంజాల కుమారస్వామి, ఎండి ఇమ్రాన్ ,మొలుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.






