- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ విడుదల
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వేములవాడ మున్సిపాలిటీ 28వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు.

దిశ, వేములవాడ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వేములవాడ మున్సిపాలిటీ 28వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు. 28వార్డులకు సంబంధించి విడుదల చేసిన లిస్ట్ లో కొంతమంది ఆశావాహుల పేర్లు గల్లంతయ్యాయి. మరి కొంతమంది ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి, మరికొంత మంది కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించారు. 4వ వార్డు మిస్సింగ్ అభ్యర్థి తోట రాజుకు టికెట్ ఖరారైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో ముస్లిం మైనార్టీలకు ఏ ఒక్కరికి చోటు దక్కకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మైనార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికార పార్టీ తీరుపై మండిపడుతున్నారు. వారినీ బుజ్జగించే ప్రయత్నాల్లో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులు నిమగ్నమయ్యారు.






