- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్, కౌశిక్ రెడ్డిలపై కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్
ఎన్నికలు రాగానే హుజురాబాద్ అభివృద్ధి అంటూ చెప్పే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు గడిచిన రెండేళ్లలో హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలకు నిధులు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.

దిశ, హుజురాబాద్ రూరల్: ఎన్నికలు రాగానే హుజురాబాద్ అభివృద్ధి అంటూ చెప్పే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు గడిచిన రెండేళ్లలో హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలకు నిధులు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. గురువారం హుజురాబాద్ పట్టణంలోని 2,15,16,17 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రచార సమయంలో అభ్యర్థులకు,ప్రణవ్ కు మంగళహారతులతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే సంక్షేమ పథకాల విషయంలో ఆదర్శంగా నిలుస్తూ ముందుకు వెళ్తున్నామని, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్,పేదవాడి కడుపులో ఆసరాగా సన్నబియ్యం పథకం,మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత రవాణా సౌకర్యం,10ఏళ్ల నిరీక్షణ తర్వాత నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని పేర్కొన్నారు.
జీవితంలో ప్రతి మనిషి తలెత్తుకుని జీవించేలా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసామని,గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా,పంచకుండా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను మా కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతు చేసి త్వరలో పంచనుందని తెలియజేశారు.మహిళ ఆర్థిక ప్రగతిని పెంపొందించాలని ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి ద్వారా,మహిళలకు వడ్డీ లేని రుణాలను అలాగే స్వయం ఉపాధి సంఘాలకు నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు.ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల చేతి గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని తద్వారా మున్సిపల్ అభివృద్ధి బాధ్యత మాపై మరింత పెరుగుతుందని తెలిపారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ నిధుల ద్వారా పట్టణల అభివృద్ధికి నిధులు మంజూరు ఆచేశామని అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్,జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరొక 15కోట్లు మొత్తం 30 కోట్లు మంజూరు చేసిందని,ఈ నిధుల ద్వారా పట్టణాల సుందరీకరణతో పాటు అభివృద్ధి చేస్తామని,హాస్పిటల్స్ కు 30 లక్షలు ఇచ్చామని,అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయడం ద్వారా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు.
హుజురాబాద్,జమ్మికుంట ప్రచారంలో బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఓట్లపై తప్ప అభివృద్ధిపై దృష్టి లేదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని నిధులు తీసుకొస్తామని చెప్పిన బిజెపి నాయకుల మాటలు ఉత్తకతలే అని మరోసారి అర్థమైందని విమర్శించారు ప్రణవ్.బిజెపి ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు ఏం తీసుకురాలేదని అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జమ్మికుంట,ఉప్పల్,బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ ల అభివృద్ధికి నిధులు ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు.గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంత అభివృద్ధికి అనేక నిధులు తీసుకొచ్చారని కరీంనగర్ టు తిరుపతి ట్రైన్,జమ్మికుంట రైల్వే స్టేషన్ ను మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి,ఇల్లందకుంట దేవస్థానానికి నిధులు ఇచ్చారని గుర్తు చేశారు.అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కు పోటీ చేసే అభ్యర్థులు,వార్డ్ అధ్యక్షులు,పట్టణ,మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు






