- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడిమ్యాల ఎమ్మార్వో, సర్పంచ్ పై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
జిల్లా ప్రజావాణిలో ఎమ్మార్వోపై వచ్చిన ఫిర్యాదును తిరిగి అదే ఎమ్మార్వోకు ఫార్వర్డ్ చేయడం వివాదాస్పదంగా మారింది.

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జిల్లా ప్రజావాణిలో ఎమ్మార్వోపై వచ్చిన ఫిర్యాదును తిరిగి అదే ఎమ్మార్వోకు ఫార్వర్డ్ చేయడం వివాదాస్పదంగా మారింది. గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన నరసయ్య తన భూమి అమ్మకం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. నరసయ్యకు కోనాపూర్ గ్రామంలో పట్టా భూమి ఉందని, దానిని అమ్మేందుకు ప్రయత్నించిన సమయంలో కొడిమ్యాల సర్పంచ్ జోక్యం చేసుకుని ఎమ్మార్వోకు ఫోన్ చేసి ఇప్పటికే బుక్ చేసిన రిజిస్ట్రేషన్ స్లాట్‌ను నిలిపివేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమస్య పరిష్కారం కోసం సర్పంచ్‌ను సంప్రదించగా.. రూ.2 లక్షలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పినట్లు ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆశ్రయించినప్పటికీ, ఎమ్మార్వోపై చేసిన ఫిర్యాదును తిరిగి అదే ఎమ్మార్వోకు పంపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులను ఆర్డీఓ లేదా పక్క మండల ఎమ్మార్వో ద్వారా విచారణ జరిపించాల్సి ఉండగా ఆరోపణలు ఎదురుకుంటున్న అదే అధికారికి బాధ్యత అప్పగించడం పై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.






