- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ: ఎమ్మెల్యే కవ్వంపల్లి
by Kodari Anjali |
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.

X
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శనివారం మానకొండూర్ మండలంలోని మానకొండూర్, అన్నారం, పచ్చునూరు గ్రామాల్లో నూతన చౌకధరల దుకాణాలను (రేషన్ షాపులను) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రేషన్ దుకాణాల నిర్వహణలో డీలర్లు జవాబుదారీతనంతో వ్యవహరించాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు & పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story






