భూ భారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి: అడిషనల్ కలెక్టర్

by Kodari Anjali |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి భూ రీ సర్వేకు రైతులు అందరూ సహకరించాలని అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత కోరారు.

భూ భారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి: అడిషనల్ కలెక్టర్
X

దిశ, పెగడపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి భూ రీ సర్వేకు రైతులు అందరూ సహకరించాలని అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత కోరారు. మండలంలోని నరసింహుని పేట గ్రామంలో నిర్వహించిన భూ భారతి భూ రీ సర్వే అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ భారతి భూ రీ సర్వే వల్ల అనేక రకాలైన భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి రైతులు అందరూ తమ సహకారం అందజేసి వారి సమస్యల పరిష్కారం చేసుకోవాలని ఈ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ఈ కార్యక్రమం మండలంలోని మూడు గ్రామాల్లో చేపట్టి రానున్న రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్, ఎంపిడిఓ ప్రేమ్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, రెవెన్యూ సిబ్బంది, నాయకులు సంధి మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Next Story