- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లాలో ఎరువుల కొరత లేదు, రైతులు ఆందోళన చెందవద్దు
జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. జిల్లాలో

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. జిల్లాలో పంటల సాగు, ఎరువులు, యాజమాన్య పద్ధతులు తదితరు అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల్లో సాగు విస్తీర్ణం, ఎరువుల నిలువలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయా పంటల సాగుకు అణుగుణంగా ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ తెప్పిస్తున్నామని స్పష్టం చేశారు.
యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. వ్యవసాయశాఖ అధికారులు అప్రమంతంగా ఉండాలని తమ మండలాలకు వచ్చే ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని ఆదేశించారు. రైతులు తమకు అవసరమైన ఎరువులు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా, ఇతర అవసరాలకు వాడకుండా చూడాలని ఆదేశించారు.
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారు యాజమాన్య పద్ధతులు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించి ఎరువులు వినియోగించేలా అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.






