- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి
విద్యార్థులపై ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, ఇంగ్లీషులో పట్టు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇంగ్లీషులో పట్టు సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులు విద్యార్థులు ఇంగ్లీషులో రాణించేందుకు తీసుకుంటున్న చర్యలను వేదికపై వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఆంగ్లంలో రాణించేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేయాలని అన్నారు. స్పెల్ బి, హ్యాండ్ రైటింగ్, బుక్ రివ్యూ, సందేశాత్మక సినిమా రివ్యూ రాయించడం వంటివి అమలు చేయాలని తెలిపారు. బుధవారం బోధనలో ఇంగ్లీష్ సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో లిటరల్లీ ల్యాంటన్ లాంగ్వేజ్ క్లబ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తద్వారా విద్యార్థులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు తదితర లాంగ్వేజీలలో పట్టు సాధిస్తారని తెలిపారు. ఇంగ్లీష్ విద్య విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతగానో ఉపకరిస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరు ఇంగ్లీషులో రాణించేలా చూడాలని అన్నారు. తల్లిదండ్రుల సమావేశంలోనూ విద్యార్థులు నేర్చుకున్న ఇంగ్లీష్ అంశాలను విద్యార్థుల ద్వారానే తెలియజేయాలని సూచించారు. పిల్లలతో ప్రతిరోజు ఒక పేజీ రాయించడం, రెండు పేజీలు చదివించడం చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.






