- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో నాగుపాము ప్రత్యక్షం
by velandi.Saikiran |
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుసంధామైన భీమన్న ఆలయ సమీపంలో నాగుపాము ప్రత్యక్షం అయింది.

X
దిశ, వేములవాడ టౌన్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుసంధామైన భీమన్న ఆలయ సమీపంలో నాగుపాము ప్రత్యక్షం అయింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిత్యం వేలాది భక్తులు వస్తున్న సమయంలో కూడా నాగు పాములు కనబడటంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా సార్లు జరిగినా పట్టించుకోవడం లేదని ఆలయ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. లడ్డు కేంద్ర గోదాంలో చాలా సార్లు పాములు కనిపించాయి. ఇక తాజాగా ఆలయ ప్రాంగణంలో మరోసారి పాము కలకలంరేపింది. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనలో గురయ్యారు. దీంతో స్నేక్ స్నాచర్ కు సమాచారం అందించారు ఆలయ అధికారులు. దీంతో 8 అడుగులు ఉన్న ఆ పామును పట్టుకుని, అడవిలో వదిలేశాడు స్నేక్స్ స్నాచర్.
Next Story






