- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గని ప్రమాదంలో మరణించిన పట్టభద్రుల వారసులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులు
గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులను ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.

గని ప్రమాదంలో మరణించిన పట్టభద్రుల వారసులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులు
డిప్యూటీ సీఎల్సీ సమక్షంలో గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యం ఒప్పందం
దిశ, గోదావరిఖని: గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులను ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. గురువారం హైదరాబాద్ విద్యానగర్ లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కు, సింగరేణి యాజమాన్యానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. విద్యార్హత కలిగిన వారు జనరల్ అసిస్టెంట్ గా మాత్రమే పనిచేసే అవకాశం దక్కేది. 2009 లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ డిగ్రీలైన మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా(మైనింగ్ / మెకానికల్/ఎలక్ట్రికల్), ఐటీఐ(ఎలక్ట్రికల్/ ఫిట్టర్/ వెల్డర్) కోర్సులు పూర్తి చేసిన వారికి విద్యార్హతల కు తగిన ఉద్యోగాలు కల్పించడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించారు. వీరి తో పాటు ఇతర డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులో నియామకం కల్పించాలని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ చేసిన విజ్ఞప్తి పై జూన్ 27 వ తేదీన జరిగిన డైరెక్టర్ (పా) స్థాయి 51 వ నిర్మాణాత్మక సమావేశంలో చర్చించడం జరిగింది. సంస్థ సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు 2025 సెప్టెంబర్ 5న సింగరేణి ప్రధాన కార్యాలయం లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తో యాజమాన్యం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది.యూనియన్ ప్రతినిధులు, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోమారు చర్చల అనంతరం త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించడం తో గురువారం తాజా ఒప్పందం జరిగింది.
ఒప్పంద విశేషాలు..
గని ప్రమాదం లో మరణించిన ఉద్యోగి కుటుంబంలో అర్హులైన టెక్నికల్ డిగ్రీ ఉన్న వారసులు లేనిపక్షంలోనే ఏదైనా ఇతర డిగ్రీ అర్హత ఉన్న వారు గ్రేడ్ 3 క్లర్కు పోస్టు కు అర్హులు. సంస్థలో గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల లభ్యతను బట్టి కంపెనీ వీరికోసం నిర్వహించే ప్రత్యేక పరీక్షలో డిగ్రీ అర్హత గల వారసులు పాల్గొనాల్సి ఉంటుంది. పరీక్షలో పాసైన వారు మాత్రమే గ్రేడ్ 3 క్లర్కు పోస్టులో నియామకానికి అర్హత సాధిస్తారు. గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కాని వారసులకు జనరల్ అసిస్టెంట్(కేటగిరీ-1) గా ఉద్యోగ అవకాశం కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) శ్రీ బిశ్వ భూషణ్, సింగరేణి తరఫున డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు, జిఎం(యూజి మైన్స్) వై.రఘు రామి రెడ్డి, జిఎం(పర్సనల్) ఐఆర్ & పిఎం కవితా నాయుడు, జిఎం(హెచ్ఆర్డి) టి.వెంకట రామ రెడ్డి, జిఎం(సివిల్) డి.వెంకటేశ్వర్లు, జిఎం (ఎంఎస్) రవి బొజ్జా, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు ఎం.రంగయ్య, కె.వీరభద్రయ్య, ఎం.సమ్మయ్య, శ్రీ మద్ది ఎల్లయ్య, వై.వి.రావు పాల్గొన్నారు .






