కార్మికులకు వేధింపులు..సీఐటీయూ సీరియ‌స్‌

by velandi.Saikiran |

సంస్థ వ్యాప్తంగా గైహాజరుపై క్రమశిక్షణ పేరిట యాజమాన్యం విడుదల చేసిన సర్కులర్ తో కార్మికులను

కార్మికులకు వేధింపులు..సీఐటీయూ సీరియ‌స్‌
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: సంస్థ వ్యాప్తంగా గైహాజరుపై క్రమశిక్షణ పేరిట యాజమాన్యం విడుదల చేసిన సర్కులర్ తో కార్మికులను మానసిక వేదనకు గురించేస్తోందని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. శుక్రవారం అర్జీ-2 డివిజన్ పరిధిలోని యూనియన్ ఆఫీసులో నిర్వహించిన బ్రాంచ్ కమిటీ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నెలలో అండర్ గ్రౌండ్ కార్మికులు 16 మాస్టర్లు, సర్ఫేస్ కార్మికులు 20 మాస్టర్లు చేయకపోతే నోటిస్ ఇచ్చి కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ పేరిట మానసికంగా వేధింపులకు గురి చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాజమాన్యం నిర్ణయం సరికాదని కార్మికులకు వ్యక్తిగత, కుటుంబ సభ్యుల సమస్యలు, అవసరాలు మూలంగా విధులకు గైర్హాజరు కావలిసి వస్తుందని పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ఎంప్లాయిస్ ఆబ్సెంట్ అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ విడుదల చేసిన సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ముత్యంరావు, ఆర్జి-2 ఏరియా సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్, ఆర్గనైజర్ సెక్రెటరీ సంపత్, వైస్ ప్రెసిడెంట్ భూమయ్య, రామ్ ప్రసాద్, సాంబరావు, రాంసాగర్, నరసింహారావు, వినేష్, శివకుమార్, పిట్ కమిటీ సభ్యులు నాగరాజు, తిరుపతి, ప్రశాంత్, జగదీష్, వినయ్ రాజ్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story