శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

by velandi.Saikiran |

మంథని సర్కిల్ లో రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు విఘాతం క‌లిగిస్తే, కఠిన చర్యలు తప్పవని మంథని సీఐ రాజు హెచ్చరించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
X

దిశ, మంథని : మంథని సర్కిల్ లో రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు విఘాతం క‌లిగిస్తే, కఠిన చర్యలు తప్పవని మంథని సీఐ రాజు హెచ్చరించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని ఏసిపి మడత రమేష్ ల సూచన మేరకు మంథని సర్కిల్ పరిధిలోని మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాజు రౌడీ షీటర్లతో మాట్లాడుతూ.. గతంలో తెలిసి తెలియక తప్పులు చేశారని, ఇప్పటికైనా మీ ప్రవర్తనలో మార్పు వస్తే పోలీస్ శాఖ మీకు సహకరిస్తుందని సూచించారు. మీరు మారకుండా మళ్లీ రౌడీషీటర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులు చేస్తే మీపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సీఐ వారిని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మంథని ఎస్ఐ రమేష్, సిబ్బంది ఉన్నారు.

Next Story