గడ్డిమందు తాగి వివాహిత ఆత్మహత్య

by Bhanu |   (  Updated:2025-06-09 13:44:00  IST  )

చొప్పదండి మండలంలోని చాకుంట గ్రామానికీ చెందిన ఎడ్ల తేజసాయిశ్రీ (30) అనే వివాహిత గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

గడ్డిమందు తాగి వివాహిత ఆత్మహత్య
X

దిశ, చొప్పదండి : చొప్పదండి మండలంలోని చాకుంట గ్రామానికి చెందిన ఎడ్ల తేజసాయిశ్రీ (30) అనే వివాహిత గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఇంటికి రాలేదని తన భర్త జగన్ తో గొడవ పడి, మనస్థాపం చెంది క్షణికావేశంలో శుక్రవారం గడ్డిమందు తాగిన తేజసాయిశ్రీని 108లో చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.


తరువాత మెరుగైన చికిత్స కోసం ఓమేగా ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. మృతురాలికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కరీంనగర్ మార్చురీకి చేరుకొని చొప్పదండి తహసీల్దార్ నవీన్ కుమార్, ఎస్ ఐ నరేష్ రెడ్డి పంచనామ నిర్వహించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చొప్పదండి ఎస్‌ఐ నరేష్ రెడ్డి తెలిపారు.

Next Story