సైబర్ క్రైమ్స్ పట్ల పిల్లలు జాగ్రత్తగా ఉండాలి

by Ratna Kumari |

ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక చైల్డ్ వీక్ లో భాగంగా మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌రీంన‌గ‌ర్ లో ఉన్న‌న్ని పిల్ల‌లు సంర‌క్ష‌ణ కేంద్రాల్లో సైబ‌ర్ క్రైమ్స్ పై అవ‌గాహ‌న నిర్వ‌హించారు.

సైబర్ క్రైమ్స్ పట్ల పిల్లలు జాగ్రత్తగా ఉండాలి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక చైల్డ్ వీక్ లో భాగంగా మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌రీంన‌గ‌ర్ లో ఉన్న‌న్ని పిల్ల‌లు సంర‌క్ష‌ణ కేంద్రాల్లో సైబ‌ర్ క్రైమ్స్ పై అవ‌గాహ‌న నిర్వ‌హించారు. సంక్షేమ ట్ర‌స్ట్ పిల్ల‌ల సంర‌క్ష‌ణ కేంద్రంలో బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ ధనలక్ష్మి పాల్గొని సైబర్ క్రైమ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ లకు దూరంగా ఉండాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ పిల్లలు, యువతపై పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో చాట్ చేయడం, వ్యక్తిగత వివరాలు పంచుకోవడం, ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా మోసాలకు గురికావడం వంటి ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు రెండ్ల‌ కళింగ శేఖర్, విజయ్, పీఓ శాంత, రాజ్ కుమార్, హోమ్ ఇన్ చార్జి వకుల దేవి పాల్గొన్నారు.

Next Story