రేణికుంట లో చెక్ పోస్ట్ ఏర్పాటు

by Ratna Kumari |

దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం రేణి కుంట టోల్ గేట్ వద్ద ఎల్ఎండి పోలీసులు గురువారం రాత్రి చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్బంగా

రేణికుంట లో చెక్ పోస్ట్ ఏర్పాటు
X

దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం రేణి కుంట టోల్ గేట్ వద్ద ఎల్ఎండి పోలీసులు గురువారం రాత్రి చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు రోజు వారి కఠిన తనిఖీలు కొనసాగనున్నట్టు తెలిపారు. ఎల్ఎండి, ఏఆర్ పోలీసులు, స్టాటిస్టికల్ టీం, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డబ్బు, మద్యం, బంగారం వంటి నిషేధిత రవాణా వస్తువులు పట్టుకుంటే సీజ్ చేసి విచారణ చేపడుతామని అన్నారు. అన్ని వాహనదారులు ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story