- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా చక్రధర్ రెడ్డి బాధ్యతల స్వీకారం
హుజూరాబాద్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్ఓ)గా చక్రధర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా పని చేసినా చందనను విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసిన విషయం విధితమే.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజూరాబాద్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్ఓ)గా చక్రధర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా పని చేసినా చందనను విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం కరీంనగర్ లేబర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను, హుజురాబాద్ ఇన్‌ఛార్జ్ ఏఎల్ఓగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యాలయంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ ఒక్క ఫైలును పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధి కోసం కార్మికులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, నేరుగా కార్యాలయాన్ని సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్మిక శాఖ ద్వారా అందే ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.






