- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత సామానుల స్టోర్ రూంగా మారిన బస్టాండ్.. పట్టించుకోని అధికార యంత్రాంగం
ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్ సెల్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన బస్ సెల్టర్ కొంతమంది పాత సామానులు దాచిపెట్టే గోడౌన్స్‌గా వాడుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు వర్షాలకు,

ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్ సెల్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. ఏళ్ల తరబడి అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన బస్ సెల్టర్ కొంతమంది పాత సామానులు దాచిపెట్టే గోడౌన్స్‌గా వాడుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు వర్షాలకు, ఎండలకు రోడ్డుపైన నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ బస్ సెల్టర్లు జనం కోసం వేశారా? లేక పాత సామాన్లు దాచుకునేందుకు ఏర్పాటు చేశారా? అని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గంగాధర మండలంలోని బూరుగుపల్లి ప్రయాణ ప్రాంగణం కొంతమంది పాత సామాన్లతో నింపారు. దీంతో అక్కడి జనం ప్రయాణికుల కోసం ఈ బస్ సెల్టర్ ఏర్పాటు చేశారా లేక పాతసామాన్లు స్టోర్ చేసేందుకు ఏర్పాటు చేసారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఏళ్ల తరబడిగా బస్టాండ్ నిరుపయోగంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
దిశ, గంగాధర : ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్ సెల్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన బస్ సెల్టర్ కొంతమంది పాత సామానులు దాచిపెట్టే గోడౌన్స్‌గా వాడుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు వర్షాలకు, ఎండలకు రోడ్డుపైన నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పాడుతుంది. ఈ బస్ సెల్టర్లు జనం కోసం వేసారా లేక పాత సామాన్లు దాచుకునేందుకు ఏర్పాటు చేశారా అని జనం ప్రశ్నిస్తున్నారు.
పాత సామాన్ల స్టోర్ రూంగా మారిన బస్ సెల్టర్
ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గంగాధర మండలంలోని బూరుగుపల్లి ప్రయాణ ప్రాంగణం కొంతమంది పాత సామాన్లతో నింపారు. దీంతో అక్కడి జనం ప్రయాణికుల కోసం ఈ బస్ సెల్టర్ ఏర్పాటు చేశారా లేక పాతసామాన్లు స్టోర్ చేసేందుకు ఏర్పాటు చేసారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో బస్సు షెల్టర్ ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోతుందని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్టాండ్‌కు నిత్యం బూరుగుపెల్లి మీదుగా మల్యాల, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలకు ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులందరు బస్టాండ్ దగ్గర బస్ కోసం వేచి ఉంటారు. ఆ బస్టాండ్ నిండుగా పాతసామాన్లు ఉండడంతో ప్రయాణికులు వర్షానికి, తీవ్ర ఎండ ఉన్నప్పటికీ రోడ్డుపైనే నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఏళ్ల తరబడిగా బస్టాండ్ నిరుపయోగంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
నాలుగు మండల కేంద్రాలకు కేంద్రబిందువుగా...
బూరుగుపల్లి గ్రామం నాలుగు మండలాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఈ గ్రామం నుంచి రోజు వందల మంది ప్రయాణం చేస్తుండగా పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. ప్రధానంగా రామడుగు, పెగడపల్లి, మల్యాల, గంగాధర మండలాలకు వెళ్లే ప్రయాణికులకు బూరుగుపల్లి బస్టాండ్ మీదుగా ప్రయాణం సాగిస్తారు. ఆ మండలాలకు వెళ్లే బస్సు అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుంటాయి. దీంతో వందల సంఖ్యలో బస్ కోసం వేచి ఉంటారు. బస్సు షెల్టర్ ఉన్నప్పటికీ అది వాడుకలో లేకపోవడంతో ప్రయాణికులు ఆరుబయట రోడ్లపై, దుకాణాల సముదాయాల వద్ద బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. వేసవిలో మండే ఎండలు, వర్షాకాలంలో తడుస్తూ శీతాకాలంలో చలికి వణుకుతూ రోడ్లమీద పడిగాపులు కాయాల్సి రావడం చాలా దురదృష్టకరమని పలువురు వాపోతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం...
గత పదిహేను ఏళ్ల కింద ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం బూరుగుపల్లిలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేసింది. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ప్రస్తుతం ఆ బస్టాండ్ నిరుపయోగంగా మారింది. దీంతో కొంతమంది స్థానికులు ఆ బస్టాండ్‌లో పాత సామాన్లు నిల్వ చేసే స్థావరంగా మార్చుకున్నారు. ఈ పరిస్థితి సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. మండలస్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు ఈ సమస్యను గమనించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ప్రయాణికులకు కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళలు దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాల దృష్ట్యా ప్రయాణం ఆపేసి తిరిగి ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. కనీసం ఇప్పుడు అయినా అధికారులు స్పందించి బస్సు షెల్టర్‌ను శుభ్రం చేసి సక్రమంగా ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అలాగే తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను అధిగమించే దిశగా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులు కోరుతున్నారు. బూరుగుపల్లి బస్ షెల్టర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తారా అన్నది ప్రశ్నగానే మిగిలిపోతుందో లేక పరిష్కరించి ఉపయోగంలోకి తెస్తారా అనేది వేచి చూడాల్సిందే.






