- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అనర్హుల ఎరివేత షురూ
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో తనిఖీలు చేశారు.

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో తనిఖీలు చేశారు. గతంలో మండల కేంద్రంలోని మరో 38 ఇళ్లు పంపిణీ చేయవలసి ఉండగా.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీలో అవకతవకలు జరిగాయని గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మిగతా వాటిని పంపిణీ చేయలేకపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రజల సమక్షంలో వివరించాల్సి ఉండగా.. ఇక్కడ అలాంటిదేమీ జరగకుండానే కొందరు వ్యక్తులు అక్రమంగా తాళాలు పగలగొట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో చొరబడి ఉండడంతో అసలైన లబ్ధిదారులు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారని తెలుసుకొని శుక్రవారం రోజు విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ లో అక్రమంగా ఎవరైతే చొరబడ్డారో వారిని విజిలెన్స్ అధికారులు దినేష్ రెడ్డి, ప్రశాంత్ రావ్ బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నారు. అన్నీ ఉండి ఎవరైతే అక్రమంగా ఉంటే వారిని స్వచ్ఛ పూర్వకంగా వెళ్లిపోమన్నారు. అసలైన బాధితులకు న్యాయం చేస్తామని, ఎవ్వరు కానీ అయోమయంలో పడవద్దని వారు అన్నారు. పూర్తిగా విచారణ జరిగిన తర్వాతనే అసలైన అర్హులకు పంపిణీ చేస్తారని వెల్లడించారు.






