- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramagundam : రామగుండంలో కుప్పకూలిన భారీ భవనం
by Muthe.Rajitha |
పెద్దపల్లి జిల్లా(Peddapalli District)లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్ : పెద్దపల్లి జిల్లా(Peddapalli District)లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఓ భారీ భవనం కుప్పకూలిన(Building Collapsed) ఘటన చోటు చేసుకోగా.. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం(Ramagundam) కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలోకి దిగారు అధికారులు. అందులో భాగంగా ఓ భారీ భవనాన్ని కూల్చేందుకు జేసీబీ ప్రయత్నాలు చేశారు. భవనం కింద గల పిల్లర్లను కూలుస్తుండగా ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయింది. ప్రాణభయంతో స్థానికులు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగనప్పటికీ.. భవన శిథిలాలు మీద పడటంతో జేసీబీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.
Next Story






