శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తా.. బుగ్గారం ఎస్సై సతీష్

by Bhanu |

జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్‌కు నూతనంగా నియమితులైన ఎస్సై గొంగటి సతీష్ మంగళవారం తన బాధ్యతలు స్వీకరించారు.

శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తా.. బుగ్గారం ఎస్సై సతీష్
X

దిశ, బుగ్గారం : జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్‌కు నూతనంగా నియమితులైన ఎస్సై గొంగటి సతీష్ మంగళవారం తన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలను సమూలంగా అరికట్టేందుకు ప్రజల సహకారం కోరుతున్నానని తెలిపారు. ఇంతకు ముందు బుగ్గారంలో ఎస్సైగా సేవలందించిన మాడ శ్రీధర్ రెడ్డి మేడిపల్లికి బదిలీ కాగా, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సతీష్ ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన యువతకు పలు సూచనలు చేశారు.

చెడు అలవాట్లతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తూ, మద్యం సేవిస్తూ, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని అన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్, గంజాయి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తానని, ఈవ్‌ టీజింగ్ వంటి చర్యలపై సైతం శిక్షా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలంటూ ప్రజలకు ఎస్సై సతీష్ విజ్ఞప్తి చేశారు.

Next Story