- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ పర్యటనను అడ్డుకున్న బీజేవైఎం నాయకులు..
by Batti.Sumithra |
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేటీఆర్ పర్యటనను బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు.

X
దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేటీఆర్ పర్యటనను బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు. అల్మాస్పూర్ గ్రామంలో కబ్జాకు గురైన రంగా చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు కేటీఆర్ పర్యటన ఫ్లకార్డులతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రైతులు లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశాడని తెలిపారు.
వడ్లు కొనుగోలు చేసి నెల రోజులు కావస్తున్నా కానీ ధాన్యం డబ్బులు ఇంతవరకు జమకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు జితేందర్ రెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సాయి కిరణ్, నాయక్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






