నా రాజీనామాకు కార‌ణం పెట్రోల్ పంప్ వ్య‌వ‌హారమే

by velandi.Saikiran |

జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద వివాదాస్పదం అవుతున్న పెట్రోల్ పంప్ వ్యవహారమే ఆనాడు తన రాజీనామాకు

నా రాజీనామాకు కార‌ణం పెట్రోల్ పంప్ వ్య‌వ‌హారమే
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద వివాదాస్పదం అవుతున్న పెట్రోల్ పంప్ వ్యవహారమే ఆనాడు తన రాజీనామాకు కారణమని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. శుక్రవారం జిల్లా బిజెపి ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన శ్రావణి గతంలో రోడ్డు వెడల్పు లో భాగంగా పెట్రోల్ పంపు విషయమై మాట్లాడినందుకే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. పెట్రోల్ పంప్ న‌కు అన్ని అనుమతులు ఉన్నట్టయితే ఆనాడు తన మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఏముందని సూటిగా ప్రశ్నించారు.

అన్ని నిజాలు తెలిసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొందరిని కాపాడేందుకు తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 1948 సెప్టెంబర్ 17 న నిజాం పాలన ముగిసి 1949 ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే, 1952లో అసలు అమలులో లేని కిబాల ద్వారా స్థలం కొన్నట్టు ఏ విధంగా తెరపైకి వచ్చిందో అర్థం కావడం లేదు అన్నారు. సందేహాత్మకంగా ఉన్న కిబాల పత్రాన్ని అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఇతర నాయకులు పాల్గొన్నారు.

Next Story