ప్రధాని మోడీపై అభ్యంతరకరం పోస్ట్.. బీజేపీ నాయకుల ఆగ్రహం..

by Bhanu |

బయట నుంచి వచ్చే శతృవులను భారత్ నిర్భయంగా ఎదర్కొంటుంది.. కానీ భారత్ లోనే ఉంటూ.. దేశ నాశనాన్ని కోరుకునే శతృవులు మాత్రం జింక ముసుగుల్లో తోడేళ్లలాగా దేశంలోనే ఉన్నారు.

ప్రధాని మోడీపై అభ్యంతరకరం పోస్ట్.. బీజేపీ నాయకుల ఆగ్రహం..
X

దిశ, రామడుగు : బయట నుంచి వచ్చే శతృవులను భారత్ నిర్భయంగా ఎదర్కొంటుంది.. కానీ భారత్ లోనే ఉంటూ.. దేశ నాశనాన్ని కోరుకునే శతృవులు మాత్రం జింక ముసుగుల్లో తోడేళ్లలాగా దేశంలోనే ఉన్నారు. దీనికి ఈ ఘటన నిదర్శనం. రామడుగు మండలంలో ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టు రాజకీయ దుమారం రేపింది. స్థానికంగా ఉన్న ఆర్టీసీ డ్రైవర్ ఎంఏ ముజాహిద్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఏఐ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ప్రధాని మోడీ చేతికి సంకెళ్లే వేసి ఉండగా.. వెనుక పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ జవాన్లు ఉన్నారు. అంతేకాకుండా.. ఈ తతంగమంతా జైలు ఓ జైలు ముందు ఉన్నట్లు చూపిస్తూ పోస్టు చేశాడు. ఈ చిత్రాన్ని చూసిన బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీని అవమానించడాన్ని ఖండిస్తూ శుక్రవారం బీజేపీ నేతలు రామడుగు చత్రపతి శివాజీ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్ర నిర్వహించారు.


అనంతరం ఎస్ఐకి వినతిపత్రం అందజేస్తూ, ముజాహిద్‌పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరిస్థితి విషమిస్తుందని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల అధ్యక్షుడు మోడీ రవీందర్, ఉప్పు కిషన్, పోచంపల్లి నరేష్, పూరెల్ల శ్రీకాంత్, రామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయినా, ఇది మాట్లాడదగ్గ విషయమని, అభివ్యక్తి స్వేచ్ఛ పేరిట ఇటువంటి పనులు మోదీని అవమానించడమే కాక, దేశభక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story