నడి రోడ్డుపై బర్త్ డే పార్టీ.. తల్వార్ తో హంగామా..!

by Ratna Kumari |

నడి రోడ్డు పై బర్త్ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారు పైకి ఎక్కి తల్వార్ తో కేకును కట్ చేసి హంగామా చేసిన రౌడీ బ్యాచ్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

నడి రోడ్డుపై బర్త్ డే పార్టీ.. తల్వార్ తో హంగామా..!
X

దిశ, కరీంనగర్ రూరల్ : నడి రోడ్డు పై బర్త్ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారు పైకి ఎక్కి తల్వార్ తో కేకును కట్ చేసి హంగామా చేసిన రౌడీ బ్యాచ్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్ లో జనవరి 31 న అర్థరాత్రి 12 గంటల సమయంలో నడి రోడ్డుపై ఓ మైనర్ వ్యక్తి బర్త్ డే పార్టీలో కారుపైకి ఎక్కి కేక్ ను తల్వార్ తో కట్ చేశారు. కేక్ క‌టింగ్ తో పాటు బాణాసంచా కాలుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇక‌ అదే సమయంలో యుగేందర్,చరణ్ అనే వ్యక్తులు తమ వాహనంలోని టెంట్లను ఆ పక్కనే దింపుతుండగా అనవసరంగా జోక్యం చేసుకుని వారిని బూతులు తిడుతూ కర్రలతో, బండలతో దాడి చేసి వారి వద్ద నుంచి రూ.2వేలు, ఒక ఫోన్ తీసుకుని రూ 40 వేల విలువ గల మొబైల్ ఫోన్స్ ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో ముగ్గురు మేజర్లు వాలకుంట్ల అజయ్, ముక్కెర విఘ్నేష్, గుంజ రంజిత్ ఉండ‌గా.. ఆరుగురు మైనర్లు ఉన్న‌ట్టు సీఐ వెల్ల‌డించారు.

Next Story