- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెల్గటూర్ లో బైక్ చోరీ
వెల్గటూర్ లో ఓ వ్యక్తికి చెందిన గ్లామర్ బైక్ ను బైకు చోరీలు క్షణాల్లో మాయం చేశారు.

దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ లో ఓ వ్యక్తికి చెందిన గ్లామర్ బైక్ ను బైకు చోరీలు క్షణాల్లో మాయం చేశారు. వెల్గటూర్ మండల కేంద్రంలో నిత్యం బిజీ గా ఉండే అంబేద్కర్ సెంటర్ లో ఉండే టిఫిన్ సెంటర్ ముందే ఈ చోరీ జరగటం విశేషం. వెల్గటూర్ మండల కేంద్రంలో ఉండే పాక్స్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న అనిల్ విధుల నిమిత్తం ఆఫీసుకు వెళ్తూ అంబేద్కర్ సెంటర్ లో ఉన్న టిఫిన్ సెంటర్ ముందు బైక్ ఉంచి టిఫిన్ కోసం వెళ్ళాడు. టిఫిన్ చేసి తిరిగి వచ్చేటప్పటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ ను అపహరించుకు వెళ్ళారు. చుట్టుపక్కల ఎక్కడ వెతికిన బైక్ ఆనవాళ్ళు కనిపించలేదు. అయితే అదే సెంటర్ ముందు ఓ స్టార్ సిటీ బైక్ ఉండటం దానికి తాళం చెవి ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. బైక్ ను తీసుకు వెళ్ళిన ఆగంతకుడు పొరపాటున తీసుకెళ్లాడని అనుకుంటే అతడు సాయంత్రం వరకు తిరిగి రాలేదు.
గ్లామర్ బైక్ ను కచ్చితంగా పథకం ప్రకారమే చోరీ చేసినట్లు తెలుస్తుంది. దీంతో బాధితుడు అక్కడే ఉన్న షాప్ లో సీసీ కెమెరాలు పరిశీలించిన ఎటు వంటి ఆధారం లభించలేదు. అయితే అంబేద్కర్ సెంటర్ లో పోలీసు వారు బిగించిన సీసీ కెమెరాలు పనిచేయటం మానేశాయి. దీంతో బైక్ చోరీ చేసిన వారిని గుర్తించటం కొంత కష్టంగానే ఉంది. అయితే బైక్ పోగొట్టుకున్న అనిల్ చుట్టుపక్కల స్నేహితులకు చోరీ విషయం చెప్పి అలెర్ట్ చేశారు. దీంతో కొందరు స్నేహితులు చోరీకి గురైన బైకును బుగ్గారం మండలం మద్దునూరు లో గుర్తించి పట్టుకోగా చోరీ కథ చివరికి సుఖాంతం కాగా పోలీసులకు దర్యాప్తు చేపట్టే పని తప్పింది. ఇదిలా ఉంటే అంతకు ముందే వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఉదయ్ కుమార్ దరఖాస్తు స్వీకరించి విచారణ చేపట్టారు.






