మాదిగలకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి

by velandi.Saikiran |

మాదిగ జాతిని కించపరిచేలా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు చందుర్తి మండల

మాదిగలకు మంత్రి పొన్నం ప్రభాకర్  క్షమాపణ చెప్పాలి
X

దిశ, చందుర్తి : మాదిగ జాతిని కించపరిచేలా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు చందుర్తి మండల నాయకులు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘాల వేములవాడ డివిజన్ అధ్యక్షుడు దుమ్మా ఆనంద్ మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరాన్ని దెబ్బతీసే విధంగా సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచే విధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడడాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే, మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పొన్నం దిష్టిబొమ్మను దహనం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే పొన్నం ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. చందుర్తి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు తర్రే శంకరయ్య , మాదిగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు లింగంపల్లి అర్జున్, అంబేద్కర్ సంఘాల డివిజన్ అధ్యక్షుడు దుమ్మా ఆనంద్, చందుర్తి మండలం కార్యవర్గ సభ్యుడు లింగంపల్లి శంకర్ మాదిగమల్యాల లక్ష్మీరాజ్యం మాదిగ, కొమ్ము పోశయ్య మాదిగ, గుడిసె నరసయ్య మాదిగ, ముదిగంపల్లి ప్రభాకర్ మాదిగ పాల్గొన్నారు.

Next Story