- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా ప్రభుత్వంలో రైతులకు పెద్ద పీట : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రజా ప్రభుత్వంలో రైతులకు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

దిశ, కథలాపూర్ : ప్రజా ప్రభుత్వంలో రైతులకు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పర్యటించారు. మార్కుపెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని 86 మంది అర్హులైన లబ్ధిదారులకు, 31 లక్షల 81 వేల రూపాయలను సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు వారు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు నేటి వరకు నిర్విజ్ఞంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకు మొక్కజొన్నను విక్రయించకుండా ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర క్వింటాలుకు 2400 రూపాయలకు విక్రయించాలని ఆయన రైతులను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నదని, మండలంలో పోసానిపేట, సిరికొండ గ్రామంలో నూతన 33/ 11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, మండల కేంద్రంలో 220 సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. మేడిపల్లి, కథలాపూర్ భీమారం మూడు మండల ప్రజల వరద ప్రదాయిని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల ఏఎంసీ చైర్మన్ పుండ్రా నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష-హరిప్రసాద్, మండల వ్యవసాయ అధికారిణి యోగిత, రాష్ట్ర పీసీసీ కార్యవర్గ సభ్యులు తోట్ల అంజయ్య, అధ్యక్షులు కాయితీ నాగరాజు, బ్లాక్ అధ్యక్షులు ఎం.డి. అజీమ్, గ్రామ సర్పంచ్ న్యావనంది శేఖర్, పాక్స్ చైర్మన్ కందరి జీవన్ రెడ్డి, డైరెక్టర్స్ జవ్వాజి చౌదరి, అల్లకొండ విజయ్, లకావత్ రమేష్, జవ్వాజి రవి, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, వర్దినేని లింగా రావు, వెల్చాల సత్యనారాయణ, వంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.






