- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధరణి దొరల చట్టం భూ భారతి పేదల చట్టం: మంత్రి పొంగులేటి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవిన్యూ సధస్సు కార్యక్రమములో రెవెన్యూ హిసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

దిశ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవిన్యూ సధస్సు కార్యక్రమములో రెవెన్యూ హిసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రెండో విడత కింద పోరాటాల చరిత్ర అయిన ఈ ప్రాంతములోభూ భారతి ప్రారంభిచు కుంటున్నము.గుట్టలు చదును సాగుచేసుకొని ఉన్నారు,వాటిని పట్టాలు చేయడమే ఈ భూ భారతి.అప్పుడు అమ్ముకొని పోయిన దొరలు ఇప్పుడు మళ్ళీ వచ్చి పెత్తనుము చేస్తున్నారు.
వాటిని న్యాయంగా భూ భారతి లో రైతులకు న్యాయం కానున్నది.న్యాయపరంగా సమస్య ఏర్పడితే వాటిని కోర్టుకు పోకుండా ఈ ఆర్ ఓ ఆర్ చట్టం కింద పరిష్కారం అవుతుంది.మహిళలకు వడ్డీ లేకుండా రుణం ఇచ్చి అదుకోబోతున్నము. రుద్రంగి అంటే నాకు ఎనలేని అనుబంధం ఉంది అన్నారు ఈ ప్రాంత రోడ్డు కు నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పంచాయిలతో కార్యలయము చుట్టూ తిరుగకుండ ఈ భూ భారతి తో సమస్య పరిష్కారం అవుతుంది.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ పథకం తెచ్చింది.ధరణి తో ఇబ్బందికి గురారయ్యారు,అధికారులు కూడా ఏమి చేయలేకపోయారు.ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కబ్జాలకు గురయ్యిందో, ఆక్రమణకు చేసుకున్నారో వారే చెప్పాలి,గత పదేండ్లలో ప్రభుత్వ భూమీ కబ్జా చేసిన వారు స్వంచందంగా తిరిగి ఇవ్వాలి అని అన్నారు.వేములవాడ రుద్రంగి నుండి బొంబాయి కు వెళ్ళడానికి రెండు ఆర్టీసి బస్ లు వేయడానికి హామీ ఇచ్చారు,మహిళలను కోటీశ్వర్లను చేయాలమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి*శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి దొరల చట్టం..భూ భారతి పేదల చట్టమన్నారు. పేదల కళలను నెరవేర్చడం కోసం కొన్ని వేల మంది మెదవులతో ఏర్పాటు చేసిన ఈ భూ భారతి.అంబేద్కర్ జన్మదినం రోజు పురస్కరించుకొని ఈ భూ భారతి చట్టం తెచ్చాము.తాళిని తాకట్టు పెట్టి భూ సమస్యల పరిష్కారం కోసం తిరుగారు అయిన కాలేదన్నారు. అవ్వన్నీ భూ భారతి లో పరిష్కారం అవుతాయి. రిజిస్ట్రేషన్ లో సరిహద్దులలో పాటు సర్వెయర్ తో కొలతలతో ప్లాన్ జాతచేయడం జరుగుతుంది. కొలతలతో మీ పాసు బుకులో ప్రింట్ చేస్తాము. జూన్ 2 తారికి వరకు లైసెన్స్ సర్వేర్లను ఎంపిక చేస్తున్నాము.ప్రతి గ్రామానికి విఆర్ఎ, విఆర్ఓ లు ఉండేవారు ఆనాటి దొర వారి రాత్రి నిర్ణయాలకు గ్రామాలకు అధికారి లేకుండా పోయారు. జూన్ 2 తారికి నాడు ముఖ్యమంత్రి చేతుల మీద పరిష్కారం జరిగే వాటిలో రుద్రంగి గ్రామము ఉంది.ఆగస్టు 15 నాటికి భూమి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతుంది.ఇంకా ఏమన్నా ఉంటే ఆ తరువాత కూడ పరిస్కరిస్తాము.
ఈ ప్రాంతానికి 1750 ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వడానికి హామీ ఇచ్చారు.2 లక్షల ఇండ్లు నిర్మించడానికి శ్రీకారం చుట్టాము.మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తహతహలాడుతుండు.ఏ అధికారి ఈ భూ భారతి విషయంలో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకుండే లేదని హెచ్చరించారు.57 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుటకు ప్రభుత్వం ముందుదన్నారు.సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు నూతనంగా స్వంత బిల్డింగ్ కు నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు రుద్రంగి మండలంతో పాటు బీమరం మండలంలో రెవెన్యూ ఆఫిసులకు నిధులు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం చేసారు అర్హులైన వారికీ ఇండ్ల ప్రొసీడింగ్ కాపిలను అందజెసారు ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతి నిధులు ప్రజలు పాల్గొన్నారు.






