- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి: ప్రభుత్వ విప్
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ పక్క భవనలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

దిశ, మేడిపల్లి : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ పక్క భవనలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుదవారం భీమారం మండల కేంద్రంలో 1 కోటి 43 లక్షలతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. అనంతరం 97 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, అర్హులైన 27 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భీమారం మండల ప్రజల చిరకాల కోరిక నేడూ నెరవేరబోతుంది.గతంలో మండల కేంద్రంలో ఉన్న పలు నిర్మాణాలను కలసి గట్టుగా తొలగించి ప్రజల కోరిక మేర వారు సూచించిన ప్రదేశంలోనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో కాకతీయ కెనాల్ పై 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి నీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం రోజున ప్రారంభం చేశారు. సుదీర్ఘంగా వల్లంపల్లి ప్రజలు ఎదురుచూస్తున్న నూతన బ్రిడ్జి అందుబాటులోకి రావడం సంతోషకరం అనీ అన్నారు. నూతన రోడ్లు అందుబాటులోకి రావడం ఒక గ్రామంలో నుండి మరొక గ్రామానికి కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు.
మేడిపల్లి మండల కేంద్రంలో మంజూరి అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న వారు జూనియర్ కళాశాలలో చేరి ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ వల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణానికి వల్లంపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ వెల్మ సమత - నవీన్ రెడ్డి కృషి ఫలితంగా బ్రిడ్జి పూర్తి అయినందుకు గ్రామస్తుల తరపున సాయిని గంగారెడ్డి బృందం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాక్ష్యగా శాలువాతో ఘనంగా సన్మానించారు.






