- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్ట్ షాపులపై పోలీసుల దాడి.. రూ. 30 వేల మద్యం సీజ్
by Bhanu |
మండలంలోని అక్రమ బెల్ట్ షాపులపై పోలీసులు ఆదివారం సాయంత్రం విస్తృత దాడులు నిర్వహించారు.

X
దిశ, గంగాధర : మండలంలోని అక్రమ బెల్ట్ షాపులపై పోలీసులు ఆదివారం సాయంత్రం విస్తృత దాడులు నిర్వహించారు. గంగాధర పోలీస్ స్టేషన్ ఇంచార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఎచ్‌ఓ పీఎస్‌ఐ స్వాతి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది. తనిఖీల్లో దార్ల రాజేశం షాపు షాపులో దాదాపుగా 24 లీటర్లు, అఖిల చికెన్ సెంటర్ వద్ద దాదాపుగా 18 లీటర్లు, కిషన్ షాపులో దాదాపుగా 7 లీటర్లు, అనుపమ చికెన్ సెంటర్ వద్ద దాదాపుగా 23 లీటర్లు, హిమ్మత్‌నగర్‌లోని నారాయణ షాపులో దాదాపుగా 12 లీటర్లు మొత్తంగా దాదాపుగా 84 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు ట్రైనీ ఎస్సై స్వాతి వెల్లడించారు. ఈ మద్యం విలువ దాదాపు రూ. 30,000గా ఉందని అంచనా. అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






