- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలను కోటేశ్వరుడిగా చేయడమే సీఎం రేవంత్ లక్ష్యం
by velandi.Saikiran |
మహిళలను కోటేశ్వరులు చేయడమే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ముందుకు వెళుతున్నారని బీర్ల ఐలయ్య అన్నారు.

X
దిశ, ఆలేరు టౌన్: కోటిమంది మహిళలను కోటేశ్వరులు చేయడమే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ముందుకు వెళుతున్నారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు తయారుచేసిన వివిధ ఆహార పదార్థాలను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశామన్నారు. వస్తువులు, ఆహార పదార్థాలను చూస్తే వెనకటి కాలంలో ఉన్నవిలా ఉంటాయని చెప్పారు. తొందర్లోనే వీరికి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎజాస్, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, పోరెల్ల సతీష్, బీజాన భాస్కర్, దూసరి మురళి, తుంగ కుమార్, జన సిదులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు
Next Story






