- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళారులతో జాగ్రత్త..ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు...
ఉద్యోగాలు ఇప్పిస్తామని జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో

దిశ,పెద్దపల్లి: ఉద్యోగాలు ఇప్పిస్తామని జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని ఏ ప్రభుత్వ శాఖ పరిధిలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతులలో నియామకాలు జరగడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒకవేళ వివిధ అవసరాల పై తాత్కాలిక ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతులలో నియామకాలు చేపడితే కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హతలు పరిశీలించి, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతులలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, నియామక ప్రక్రియలో డబ్బుకు, సిఫార్సులకు ఎక్కడ ఆస్కారం ఉండదని, ప్రజలు ఎవరు అనవసరంగా దళారులను నమ్మి మోసపోవద్దని, అనవసరంగా డబ్బును కోల్పోవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






