బ్రెయిన్ క్లాట్‌తో బాధపడుతున్న సువర్ణకు బీసీ జేఏసీ ఆర్థిక సాయం

by Nallavelli.Anjaneyulu |

హుజురాబాద్ మండలం కనకలగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి సువర్ణ గత కొంతకాలంగా మెదడులో రక్తం గడ్డకట్టే వ్యాధితో బాధపడుతున్నారు.

బ్రెయిన్ క్లాట్‌తో బాధపడుతున్న సువర్ణకు బీసీ జేఏసీ ఆర్థిక సాయం
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలం కనకలగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి సువర్ణ గత కొంతకాలంగా మెదడులో రక్తం గడ్డకట్టే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హుజురాబాద్ బీసీ జేఏసీ, గౌరీశెట్టి మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఆమె నివాసానికి వెళ్లి సువర్ణ భర్త జీవన్ కుమార్‌కు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన జీవన్ కుమార్ లక్షల రూపాయలు అప్పులు తెచ్చి గతేడాది హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో భార్యకు శస్త్రచికిత్స చేయించారని తెలిపారు. అయినప్పటికీ సువర్ణ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉండటం బాధాకరమన్నారు. ​చికిత్స నిమిత్తం ఇప్పటికే ఆర్థికంగా కుంగిపోయిన ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో ముందుకు రావాలని ఆయన కోరారు. సహాయం చేయదలచిన వారు 94923 00284 అనే నంబర్‌కు విరాళాలు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల ఉప సర్పంచ్ ల‌ ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, గౌరీశెట్టి మధురమ్మ ట్రస్ట్ నిర్వాహకుడు గౌరీశెట్టి జగదీశ్వర్, బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, తాళ్లపల్లి అమరేందర్, పల్లె సతీష్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story