అగ్ని మంటలకు బాస్మతి వరి కుప్పలు దగ్ధం

by Bhanu |

మండలంలోని హుసేన్యామియా వాగు పరివాహక ప్రాంతంలో గుర్తు తెలియని ఓ రైతు చేసిన పనికి, మరో ఇద్దరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

అగ్ని మంటలకు బాస్మతి వరి కుప్పలు దగ్ధం
X

దిశ, కాల్వశ్రీరాంపూర్: మండలంలోని హుసేన్యామియా వాగు పరివాహక ప్రాంతంలో గుర్తు తెలియని ఓ రైతు చేసిన పనికి, మరో ఇద్దరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వారి వాగు పరిహార పందించిన ఎవరో రైతులు తలం పొలం కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చే ప్రయత్నం చేయగా, కొయ్య కాలుకుంటు జంగా రాజయ్యకు చెందిన ఒక ఎకరం,10 గుంటల బాస్మతి వరి కుప్ప,అలాగే కొరకండ్ల శ్రీనివాస్ రెడ్డి కి చెందిన 28 గుంటల బాస్మతి వరి కోసి ఒక దగ్గర కుప్ప వేసుకున్నారు. ఆ రైతుల సంబంధించిన వరి గొప్పలు మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతి పూర్తిగా వరి కాలిపోయిందని, రాజయ్య అనే రైతుకు 50,000, శ్రీనివాస్ రెడ్డి అనే రైతుకు 30,000 రూపాయలు నష్టపోయినట్లు వారు వాపోయారు. వరి కొయ్యలు కాలబెట్టడం వలన, పక్కనే కొయ్యని వరి పొలం ఉండగా, చుట్టుపక్కల రైతులు వచ్చి మంటలను చల్లార్చారు. రైతులకు కొయ్య కాలు కాల్చ వేయద్దని, వ్యవసాయ అధికారులు సూచనలు చేయాలని బాధిత రైతులు వాపోతున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు బాధిత రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నాను.



Next Story