- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ కక్షతోనే మంత్రి శ్రీధర్ బాబు పై నిరాధార ఆరోపణలు
దిశ, యైటింక్లయిన్ కాలనీ : రాజకీయ కక్షతోనే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పై మంథని

దిశ, యైటింక్లయిన్ కాలనీ : రాజకీయ కక్షతోనే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అనుచిత వ్యాఖ్యలు, అనవసరపు విమర్శలు చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఇరికి మహేష్ అన్నారు. మంగళవారం ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఉద్యోగాల విషయంలో వాస్తవాలను వక్రీకరణ చేసి మాట్లాడుతున్నాడని, రాజకీయ కక్షతోనే అనవసరపు విమర్శలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఉనికిని చాటుకోవడం కోసమే మంత్రి పై మధు నిరాధారమైన ఆరోపణలు చేసుతున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పనలో మంత్రి శ్రీధర్ బాబు విఫలమయ్యాడని మాట్లాడటం మధు అవివేకనికి నిదర్శనం అన్నారు. పుట్ట మధు నిసిగ్గుగా చేసిన సత్యధురమైన ఆరోపణలను, విమర్శలను యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ గత రెండేళ్లలో తెలంగాణ యువత భవిష్యత్తు మలుపు తిప్పిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగాలు 61379 భర్తీ చేసిందని,మరో 8632 సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతున్నవని మొత్తంగా 70,011 ఉద్యోగాలు కల్పించిన ఘనతను మాజీ ఎమ్మెల్యే గుర్తేరాగాలన్నారు.
మంథని నియోజకవర్గానికి జేఎన్టీయూ కళాశాల, ఉద్యానవన యూనివర్సిటీలతో పాటు ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీల ఏర్పాటు ఘనత కేవలం మంత్రి శ్రీధర్ బాబుకే దక్కుతుందని తేల్చి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ రేసింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషిస్తూ తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తున్న శ్రీధర్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.నీకు రాజకీయ భిక్ష పెట్టిన శ్రీపాద రావు కుటుంబం పై ఇష్టారితిన మాట్లాడితే ఉపేక్షించేది లేదన్నారు.నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధితో ప్రజల్లో వస్తున్న ఆధారణ చూసి ఓర్వలేక తన ఉనికి ప్రశర్ధకంగా మారుతుందని పుట్ట మధు మతిభ్రమించి వ్యవహారిస్తున్నాడని ద్వాజమేత్తారు. ఇప్పటికైనా పుట్ట మధు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, అనవసరపు విమర్శలు, నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితావు పలికారు. లేని పక్షంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుండేటి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి, మార్కరాజు, కేశవులు, తడబోయిన సాగర్, ఐఎన్ టీసీ సెంట్రల్ లీడర్స్ దశరథన్ గౌడ్, ఆకుల రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు సారయ్య నాయక్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు మోత్కు అవినాష్, మైనారిటీ నాయకులు మీర్జా అప్సర్, బాదే ధోని, పూజారి రాకేష్, ప్రశాంత్ గౌడ్, బాదే తేజ, సంపత్, సదానందం పాల్గొన్నారు.






