స‌ర్పంచ్ అభ్యర్థులకు బ్యాంకు ఖాతా కష్టాలు

by Ratna Kumari |

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మూడో విడతలో భాగంగా పంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్

స‌ర్పంచ్  అభ్యర్థులకు బ్యాంకు ఖాతా కష్టాలు
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మూడో విడతలో భాగంగా పంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ స్వీకరణ రెండో రోజు గురువారం కొనసాగుతుంది. సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు అకౌంట్ ( జీరో బ్యాలెన్స్ ) కచ్చితంగా జత చేయాలని అధికారులు నిబంధనలు జారీ చేశారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వారికి ఆర్వోలు కొత్త నిబంధనలు తెలపడంతో అభ్యర్థులు అవాకయ్యారు. ఇప్పటికిప్పుడే కొత్త బ్యాంకు అకౌంట్లు ఎలా సాధ్యమవుతాయని ఆర్వోలతో ప్రశ్నించారు. చివరికి చేసేదేమీ లేక బ్యాంకుల వైపు పరుగులు పెట్టారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కోపరేట్ బ్యాంకుల వద్ద అభ్యర్థులు బారులు తీరారు.

Next Story