- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > బండి సంజయ్.. తప్పుడు మాటలు మానుకో: సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్
బండి సంజయ్.. తప్పుడు మాటలు మానుకో: సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్
బండి సంజయ్ కు పరీక్ష పత్రాలు లీకేజీతో సంబంధం లేకపోతే తన సెల్ ఫోన్ ను పోలీసులకు ఎందుకు ఇవ్వడం లేదంటూ తెలంగాణ సివిల్ సప్లైయి కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు.

X
దిశ, కరీంనగర్ బ్యూరో: బండి సంజయ్ కు పరీక్ష పత్రాలు లీకేజీతో సంబంధం లేకపోతే తన సెల్ ఫోన్ ను పోలీసులకు ఎందుకు ఇవ్వడం లేదంటూ తెలంగాణ సివిల్ సప్లైయి కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
అభివృద్ధి విషయంలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన సవాలు స్వీకరించి బండి సంజయ్ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈడీ , సీబీఐ సంస్థలు తమ జేబు సంస్థలుగా సంజయ్ చెప్పుకుంటున్నాడని ఆరోపించారు. కేంద్రం సింగరేణి పై తప్పుడు వైఖరి అవలంభిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే సింగరేణిలో కారుణ్య నియామకాలు జరిగాయని గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ తో చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
Next Story






