బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్

by Ratna Kumari |

కరీంనగర్ జ్యువెలరీ షాపు చోరీ ఘటనపై పరామర్శకు వచ్చిన కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ చేసిన‌ వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ డిమాండ్ చేశారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి :  మాజీ ఎమ్మెల్యే  ర‌స‌మ‌యి బాల‌కిష‌న్
X

దిశ, మానకొండూరు : కరీంనగర్ జ్యువెలరీ షాపు చోరీ ఘటనపై పరామర్శకు వచ్చిన కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ చేసిన‌ వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ డిమాండ్ చేశారు. మాన‌కొండూర్ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. కేటీఆర్‌కు ఎటువంటి చెడు అలవాట్లు లేవని, ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసని రసమయి ఎద్దేవా చేశారు. బండి సంజయ్ తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా ఉండి కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు.


బెజ్జంకిలో పొద్దుతిరుగుడు పంట పండించి మూడు నెలలవుతున్నా కొనే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పొలం దున్నకముందే రైతు బంధు వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట కోతకు వచ్చినా సాయం అందడం లేదని మండిపడ్డారు. గద్దపాకలో ధాన్యం కుప్పపై గుండె ఆగి రైతు చనిపోతే, కనీసం పరామర్శించలేని స్థితిలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారని విమర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ మృతి చెందితే పరామర్శించే 'సోయి' కూడా ఎమ్మెల్యేకు లేదని ధ్వజమెత్తారు. "శాంతిభద్రతల విషయంలో కరీంనగర్ కమిషనర్ గౌస్ సలామ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం తక్షణమే రివ్యూ నిర్వహించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ స‌మావేశంలో మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, శాతరాజు యాదగిరి పాల్గొన్నారు.

Next Story