స్కాంలకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ కుటుంబం‌: Bandi Sanjay

by Gopi |
స్కాంలకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ కుటుంబం‌: Bandi Sanjay
X

దిశ, జగిత్యాల ప్రతినిధి /కోరుట్ల /మెట్టుపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్టుపల్లిలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా సంజయ్ తో పద్మశాలి సంఘం ప్రతినిధుల బృందం సమావేశమై పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకై కృషి చేయాలని కోరారు. సంఘ ప్రతినిధులతో సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఖాది బోర్డు పద్మశాలీల చిహ్నం అని ఖాదీ బోర్డు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్రం పెత్తనం చేస్తుందని కేసీఆర్ ప్రభుత్వం ఖాదీ బోర్డును అమ్మకానికి పెట్టేందుకే 99 సంవత్సరాల లీజు పేరుతో నాటకం ఆడుతుందని ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబంలో లిక్కర్ నుండి స్యాండ్ వరకు అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నవారే ఉన్నారని, కేసీఆర్ కుటుంబం స్కాంలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టానని, బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా దళిత సమైక్య ప్రజా సమితి నాయకులు సంజయ్ ని కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, దళిత సంఘాల నాయకులు విన్నవించగా దళితుల సమస్యలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు.

షుగర్ ఫ్యాక్టరీ నేతలతో..

కోరుట్ల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ నేతలు కలిసి ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సహకరించాలని కోరగా ఫ్యాక్టరీ పునరుద్ధరణకై రైతులతో కలిసి ఉద్యమిస్తానని బండి హామీ ఇచ్చారు. అక్రమ వ్యాపారాలు చేస్తూ రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని నొక్కేసిన కేసీఆర్ కుటుంబానికి 250 కోట్ల రూపాయలతో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు మనసొప్పడం లేదంటూ చురకలు అంటించారు. ఫ్యాక్టరీ ప్రారంభించడం చేతకాదని కేసీఆర్ రాసిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత తానే తీసుకుంటానని నేతలతో అన్నారు.

సహారా స్కాంలో కేసీఆర్ పాత్ర..

పాదయాత్రలో భాగంగా సహారా ఏజెంట్లు డిపాజిట్ దారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని సంజయ్ ని కోరగా సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డిపాజిట్ దారులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే సహరా స్కాం విషయమై విచారణ జరుగుతుందన్న బండి.. స్కాంలో నాడు కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఈఎస్ఐ, సహారా స్కాంలతో పాటు కేసీఆర్ అవినీతి భాగోతం కూడా బయటకు వస్తుందన్నారు.

Also Read....

మరోసారి ఔదార్యం చాటుకున్న Etela Rajender

Next Story

Most Viewed