- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పాలన బీసీలకు న్యాయం చేయలేకపోయింది.. బండి సంజయ్ ఘాటు విమర్శ
దేశానికి బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, కోనరావుపేట : దేశానికి బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన భవన నిర్మాణ పనులు, కాంపౌండ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఇతర అధికారులు, నాయకులతో కలిసి బండి సంజయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్కూల్ విద్యార్థుల వసతులు, సమస్యలు తెలుసుకునేందుకు హాస్టల్‌లో విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు బోధన విధానం ఎలా ఉన్నదన్నదానిపై విద్యార్థుల అభిప్రాయాలు అడిగారు. అనంతరం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ వ్యక్తిని కూడా ప్రధానిగా చేయలేకపోయింది. కానీ బీజేపీ అటల్ బిహారీ వాజపేయిని ప్రధాని చేసిన తరువాత ఇప్పుడు నరేంద్ర మోదీ రూపంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని దేశానికి ప్రధానిగా చేసిందని వ్యాఖ్యానించారు.
ఇంతవరకూ ఎస్సీ వర్గానికి చెందిన రాంనాథ్ కోవింద్, ఎస్టీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము, మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాం లాంటి ప్రముఖులను రాష్ట్రపతులుగా చేసిన ఘనత బీజేపీదేనని చెప్పారు. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకీ ఇప్పుడు న్యాయ భేరి మాట్లాడే అర్హత లేదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలోని 42 శాతం మంది బీసీ ప్రజలు ఉన్నా కూడా, కేవలం ముగ్గురు బీసీ నేతలకే మంత్రి పదవులు ఇచ్చారు. మీరు వదిలిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కదానికీ న్యాయం చేయలేకపోయారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేరు, రైతు భరోసాలో ఒక సంవత్సరం ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు.
ఇటీవల ప్రకటించిన పంటల బోనస్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు, చివరికి మూడే పంటలకు ఇచ్చారుని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సబ్సిడీగా రాష్ట్రానికి 13 లక్షల మెట్రిక్ టన్నులు అందజేస్తుండగా, అవసరం కేవలం 9 లక్షలే అని తెలిపారు. మిగతా 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఏమైంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు.
గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కువగా మంజూరు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రొడ్డవేణి గోపి, మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్, అల్లాడి రమేష్, గోపాడి సురేందర్ రావు, మండల అధ్యక్షుడు మిర్యాలకర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.






