నేను ఇచ్చే సైకిల్స్ మంచి బ్రాండెడ్... బతుకమ్మ చీరల వంటివి కాదు

by velandi.Saikiran |

నేను ఇచ్చే సైకిల్స్ మంచి బ్రాండెడ్... బతుకమ్మ చీరల వంటివి కాదని విమర్శలు చేశారు బండి సంజయ్ కుమార్

నేను ఇచ్చే సైకిల్స్ మంచి బ్రాండెడ్... బతుకమ్మ చీరల వంటివి కాదు
X

పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నన్ని రోజులు సైకిళ్లు పంపిణీ చేస్తా

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకు వెళ్లాలి

ఈ సైకిళ్లు బతుకమ్మ చీరల వంటివి కాదు, బ్రాండెడ్ కంపెనీవి

తనకు ఓట్లు వేసింది పెద్దలు అయితే వేయించింది మాత్రం పిల్లలే

వేములవాడ పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

దిశ, వేములవాడ: నేను ఇచ్చే సైకిల్స్ మంచి బ్రాండెడ్... బతుకమ్మ చీరల వంటివి కాదని విమర్శలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్. మంగళవారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులకు బండి సంజయ్ సైకిల్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పాఠశాలలకు వెళ్ళే 10తరగతి విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే ఈ సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తాను ఇస్తున్న ఈ సైకిళ్లు... బతుకమ్మ చీరల వంటివి కాదని పూర్తి బ్రాండెడ్ అన్నారు. రాజన్న ఆశీస్సులతో మీరు ఓట్లు వేస్తే గెలిచానని, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి నైవేద్యంగా విద్యార్థులకు ఈ సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, అడిషనల్ కలెక్టర్, ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి, జిల్లా విద్యాధికారి, ఆర్డీవో రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story