బాబోయ్ కుక్కలు..

by Elthuri vijay kumar |

మంథనిలో బెంబేలెత్తిస్తున్న గ్రామసింహాలు

బాబోయ్ కుక్కలు..
X

బాబోయ్ కుక్కలు..

- మంథనిలో బెంబేలెత్తిస్తున్న గ్రామసింహాలు

- గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్న శునకాలు

- భయందోళనలో పట్టణ ప్రజలు

దిశ, మంథని : మంథని పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైంది. పట్టణంలో జనావాసాల మధ్య గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. స్థానిక వ్యాపారుల దుకాణాల ముందు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాల నుండి ప్రజలు తమ అవసరాల నిమిత్తం మంథని వచ్చే వారు కుక్కల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్లపై సంచరిస్తూ వాహనదారులను వెంబడిస్తున్నాయి. రోజు ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మధ్య తిరుగుతూ.. మొరుగుతూ... తిరుగుతున్నాయి. కుక్కలతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story