సంతానం క‌లిగిస్తాన‌ని రూ.40వేలు వ‌సూల్ బాబా

by Ratna Kumari |

సంతానం కలిగిస్తానని నమ్మ బలికి ఓ జంట వద్ద డబ్బులు వసూలు చేసిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటు చేసుకుంది.

సంతానం క‌లిగిస్తాన‌ని రూ.40వేలు వ‌సూల్ బాబా
X

దిశ, మెట్ పల్లి : సంతానం కలిగిస్తానని నమ్మ బలికి ఓ జంట వద్ద డబ్బులు వసూలు చేసిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కోనసముద్రం గ్రామానికి చెందిన జంగిటి భార్గవి,రాజేశ్వర్ లు గత కొంత కాలంగా సంతానం కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో ఓ ఆసుపత్రికి చికిత్స కోసమని వచ్చారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నం మండలం భర్తీ పూర్ గ్రామానికి చెందిన కిరణ్, అఖిల్ అనే ఇద్దరు, తాము ఓ బాబా అనుచరులమని బాధితుడు రాజేశ్వర్ తో పరిచయం పెంచుకుని మీరు బాబా దగ్గరికి వెళ్తే సంతానం కలుగుతుందని నమ్మబలికి భర్తీ పూర్ లోని సొంతి మోహన్ అనే బాబా దగ్గరికి తీసుకువెళ్లారని తెలిపారు. తీరా అక్కడికి వెళ్ళాక సొంతి మోహన్ అనే బాబా ఇక్కడ పూజలు నిర్వహిస్తే మీకు సంతానం కలుగుతుందని రూ.50వేలు ఖర్చు అవుతుందని నమ్మించి పూజలు చేసాడని పూజ అనంతరం లక్ష్మ రూపాయలు డిమాండ్ చేయ‌గా.. రూ. 40116/ చెల్లించమని అయినా ఎంతకు సంతానం కలగపోవడంతో మోసపోయామని తెలుకుని బాబా అనుచరులైన కిరణ్, అఖిల్ లకు పలుమార్లు ఫోన్ చేసి ప్రశ్నిస్తూ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. మంత్రం తంత్రాలతో, వారి అనుచరులతో మమ్మల్ని చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తు బాబా, అతని అనుచరులు కిరణ్, అఖిల్ లపై చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ కార్యాలయం లో పిర్యాదు చేశామన్నారు.

Next Story