- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో డ్రైవర్ ఔనత్యం
ప్రస్తుతం బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుండటంతో బంగారాన్ని దొంగిలించేందుకు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.

దిశ, గన్నేరువరం : ప్రస్తుతం బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుండటంతో బంగారాన్ని దొంగిలించేందుకు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ ఆటో డ్రైవర్ తన ఔన్నత్వాన్ని చాటుకున్నాడు. తన ఆటోలో నాలుగు తులాల బంగారం, రూ.20వేల నగదు ఉన్న బ్యాగ్ ను ప్యాసింజర్లు మరిచిపోయారు. అయితే ఆ బ్యాగ్ ను గమనించి తిరిగి మళ్లీ ప్యాసింజర్లకు అప్పగించి తన ఔన్నత్వాన్ని చాటుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మనసాదేవి ఆలయానికి వరంగల్ నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం అయిన తరువాత ఎలుక అజయ్ అనే ఆటో డ్రైవర్ ఆటోలో కాసింపేట నుంచి గుండ్లపల్లి చేరుకున్నారు. ప్యాసింజర్లను గుండ్లపల్లిలో దింపి వస్తుండగా పీచుపల్లి వద్దకు రాగానే ఆటోలు ప్యాసింజర్లు మరిచిపోయిన బ్యాగ్ ను ఆటో డ్రైవర్ గమనించి తిరిగి గుండ్లపల్లెకు చేరుకొని ప్యాసింజర్లకు అప్పగించాడు. బ్యాగ్ లో ఉన్న బంగారం, నగదు యధావిధిగా ఉండటంతో ప్యాసింజర్లు సంతోషంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న మానసాదేవి ఆలయకమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రరెడ్డి ఆటో డ్రైవర్ ఎలుక అజయ్ ని ఘనంగా శాలువాతో సన్మానించి అభినిందించారు.






