- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరితహారం.. వారికి భారం
హరితహారం వారికి భారంగా మారింది. ఒకపక్క 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటి ఎండలు దంచి కొట్టుతుండడంతో చెట్లు వాడి పోతున్నాయి. చెట్లు ఎండిపోతున్న ఆయా గ్రామాల పాలకవర్గాలు, మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో మొక్కలు మోడు వారిపోతున్నాయి.

దిశ, ఎల్లారెడ్డిపేట : హరితహారం వారికి భారంగా మారింది. ఒకపక్క 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటి ఎండలు దంచి కొట్టుతుండడంతో చెట్లు వాడి పోతున్నాయి. చెట్లు ఎండిపోతున్న ఆయా గ్రామాల పాలకవర్గాలు, మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో మొక్కలు మోడు వారిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా హరితహారం పథకం కింద పెట్టిన చెట్లు పూర్తిగా ఎండిపోతుండడంతో పర్యావరణ ప్రేమికులు ఆయా గ్రామాల పాలకవర్గాలు, అధికారులపై మండిపడుతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఆయా గ్రామ పంచాయతీలకు హరితహారం పథకం కింద అప్పటి ప్రభుత్వం ట్యాంకర్లు కొనుగోలు చేసుకోవడానికి పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చినప్పటికీ వారిని హరితహారం పథకానికి వాడుకోవడానికి బదులుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్లకు నీళ్లు పట్టించడానికి చాలా గ్రామాల్లో హరితహారం ట్యాంకర్ లను వినియోగిస్తున్నారు.ఎంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం నీరుగారి పోతుంది.
ఉపాధి హామీ పథకం సిబ్బంది నిర్లక్ష్యం!
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వంలో ఉపాధి హామీ సిబ్బందితో మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే కార్యక్రమం చేపట్టి వారికి ఉపాధి హామీ పథకం కింద వేతనాలు అందించేవారు. పాలకవర్గం అధికారులు పట్టించుకోకపోవడంతో ఉపాధి హామీ సిబ్బంది మొక్కలకు నీటినీ పట్టించుకోకపోవడంతో మొక్కలు వందకు 60 శాతం వరకు ఎండిపోతున్నాయి. మొక్కలను పర్యవేక్షించాల్సిన ఉపాధి హామీ సిబ్బంది వ్యవహరించడం వల్ల చెట్లు పూర్తిగా ఎండిపోయాయి.
అసలే నిర్లక్ష్యం...మరోపక్క నరికివేత
ఎండకాలంలో హరితహారం పథకం కింద పెట్టిన మొక్కలకు నీళ్లు పట్టిం పట్టించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం నీడన కాలం వెలదీస్తుంటే మరో పక్కన పంటచేలకు నీడ వస్తుందని పేర్కొంటూ ఇటీవలఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని చెట్లను ఇరువురు వ్యక్తులు కొట్టు వేయడంతో హరితహారం గొడ్డలి వేటుకు గురైంది. ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలలో గత ప్రభుత్వం హరితహారం పథకం కింద లక్షలాది రూపాయలు వెచ్చించి మొక్కలు నాటడం వాటికి సంబంధించి కూలీలకు వేతనాలు లక్షలాది రూపాయలు వెచ్చించి ట్రాక్టర్ మరియు ట్రాలీ కొనుగోలు చేసినప్పటికీ వాటిని వినియోగించి మొక్కలు కాపాడడంలో పూర్తిగా గ్రామపంచాయతీ పాలకవర్గాలు అధికారులు విఫలమవుతున్నారు ఇప్పటికైనా హరితహారం పథకం కింద పెట్టిన చెట్లను కాపాడి పర్యావరణాన్ని కాపాడాలని మండల పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.






