- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బుల విషయంలో దాడి.. అవమాన భారంతో యువకుడి ఆత్మహత్య
అప్పుగా ఇచ్చిన డబ్బుల విషయంలో చోటు చేసుకున్న వివాదం ఓ యువకుడి పై దాడికి దారితీయగా.. అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, తంగళ్లపల్లి : అప్పుగా ఇచ్చిన డబ్బుల విషయంలో చోటు చేసుకున్న వివాదం ఓ యువకుడి పై దాడికి దారితీయగా.. అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి తల్లి బాలవ్వ, పోలీసుల కథనం ప్రకారం.. ఓబులాపూర్ గ్రామానికి చెందిన కొత్తకొండ బాలకిషన్ (26) అనే యువకుడు ఇదే గ్రామానికి చెందిన దోమల కొమురయ్య వద్ద చేబదులుగా రూ. 3వేలు లు అప్పు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ డబ్బుల విషయంలో దోమల హరీష్, దోమల వంశీ బాలకిషన్ తో, గొడవపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకిషన్ ను బూతులు తిట్టి, కర్రతో కొట్టి అవమానపరచడంతో అవమాన భారంతో ఇంటికి వెళ్లి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తల్లి కొత్తకొండ బాలవ్వ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ ఉపేంద్రచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.






