అట్రాసిటీ చట్టాన్ని రాజకీయ కక్ష్య సాధింపున‌కే వినియోగిస్తున్నారు : కొప్పుల వెంకటేష్

by Ratna Kumari |

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజకీయ కక్ష్య సాధింపున‌కే వినియోగిస్తున్నారు అని కొప్పుల వెంక‌టేష్ పేర్కొన్నారు.

అట్రాసిటీ చట్టాన్ని రాజకీయ కక్ష్య సాధింపున‌కే వినియోగిస్తున్నారు : కొప్పుల వెంకటేష్
X

దిశ, గంగాధర : చొప్పదండి నియోజకవర్గ పరిధిలో అట్రాసిటీ చట్టాన్ని రాజకీయ కక్ష్య సాధింపు కోసం వినియోగించడం సిగ్గుచేటని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ కొప్పుల వెంకటేష్ విమర్శించారు. గంగాధర మండలంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మట్టి అక్రమ రవాణా విషయాన్ని తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేసినందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రేరణతో కాంగ్రెస్ కార్యకర్తతో ఈ నెల 15న తనపై అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయించారని ఆయన ఆరోపించారు. గత 15 రోజులుగా వరుస కథనాల ద్వారా ప్రజా ఆస్తి ఎలా నష్టపోతోందో ఆధారాలతో వెల్లడించానని తెలిపారు. గంగాధర మండలంలోని కురిక్యాల నుంచి షానగర్ వరకు వరద కెనాల్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు మట్టిని తరలిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ అక్రమాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినందుకే తనపై రాజకీయ ప్రేరిత కేసు పెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఎలాంటి న్యాయపోరాటానికైనా సిద్ధమని, మట్టి అక్రమ దందాలో ఉన్న వారందరి పేర్లను ప్రజా క్షేత్రంలో బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొప్పుల వెంకటేష్‌తో పాటు గంగాధర మండల యువజన అధ్యక్షుడు పలుమారు సతీష్, యువజన కార్యదర్శి బండ గంగరాజు, బోయినపల్లి మండల అధ్యక్షుడు కొంకటి శ్రీధర్, కోడిమ్యాల మండల నాయకులు వరుణ్, కొలపురి చిరంజీవి, సురుగు అజయ్, శేఖర్ పాల్గొన్నారు.

Next Story